ఓం శ్రీ గణేశ పంచరత్నం 1.ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం!! కళాధరావతంసకం విలాసిలోక రక్షకం!! అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం!! నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం!! తాత్పర్యం.. మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే, శిరస్సున చంద్రుని ధరించిన, లోకాన్ని కాపాడే, నాయకులకే నాయకుడైన, అసురులను, అన్ని ఆశుభాలను నశింప జేసే ఆ విఘ్నేశునికి నా నమస్కారములు. 2.నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం!! నమస్సురారి నిర్జనం నతాధికా పదుద్ధరం!! సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం!! మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం!! తాత్పర్యం. భక్తుల శత్రువులకు భయం కలిగించేవానికి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే దేవునికి,సర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ నా నమస్కారములు. 3.సమస్త లోక శంకరం నిరస్త దై...
Devine law is different from Human law.